​ట్రాన్స్ కో ఏఈ అవినీతిపై విచారణ

​ట్రాన్స్ కో ఏఈ  అవినీతిపై విచారణ

నందిపేట, వెలుగు: నందిపేట సబ్​డివిజన్​పరిధిలోని నవీపేట ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో  ఏఈగా పనిచేసిన రాంసింగ్​ అవినీతికి ఆరోపణలపై బుధవారం వరంగల్​ ట్రాన్స్ కో    అధికారులు విచారణ చేపట్టారు. 2016 లో రాంసింగ్​నవీపేట ఇన్​చార్జి ఏఈగా పని చేసిన సమయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిరుద్యోగులకు ఆపరేటర్​ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడని యువకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.  

Also read :కేయూ సెర్చ్​కమిటీని వెంటనే నియమించాలి : టి.శ్రీనివాస్

ఈ విషయమై ఇదివరకే ప్రాథమిక విచారణ జరపగా.. బుధవారం వరంగల్​సీఎండీ కి చెందిన డీపీడీఈ మల్లారెడ్డి బాధితులతో తుది విచారణ నిర్వహించారు. అనంతరం తుది నివేదిక ఆధారంగా అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా  ప్రస్తుతం ఏఈ రాంసింగ్​ సస్పెండ్​లో ఉన్నాడు.