డీఎస్పీ ప్రణీత్ రావుపై దర్యాప్తు ముమ్మరం

మాజీ DSP ప్రణీత్ రావుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పంజాగుట్ట పోలీసులు. సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రణీత్ రావు ను అదుపులోకి తీసుకోనున్నారు. ప్రణీత్ రావు  సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వాటర్ వది వెళ్లొద్దంటూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్ రావును అరెస్ట్ చేసేందుకు సిరిసిల్ల బయలుదేరారు పంజాగుట్ట పోలీసులు. 

ALSO READ :- Sreemukhi: ఆ ఒక్క మాట చెప్పవా.. శ్రీముఖికి ఇంటర్ విద్యార్థి రిక్వెస్ట్

SIB అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావు తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు టాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.అయితే ఫోన్ లు టాపింగ్ చేయాలంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరిగా తీసుకోవాలి. SIB లో ప్రణీత్ రావు కు సహకరించిన అధికారుల పాత్ర పై విచారణ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు.