మ్యాన్​హోళ్ల మరమ్మతులపై విచారణ

మ్యాన్​హోళ్ల మరమ్మతులపై విచారణ

​​‘వెలుగు’ పత్రిక లో వచ్చిన ‘మ్యాన్ హోల్ గోల్ మాల్’ కథనానికి బల్దియా కమిషనర్ దానకిశోర్​ స్పందించారు. జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో.. రెండు శాఖలకు చెందిన అధికారులు రూ21.18 కోట్లతో నగరంలో 17 వేల మ్యాన్ హోల్స్ రిపేర్లు చేస్తున్నారు. ఐతే ఈ రోడ్లకు ఎత్తు వంపులుగా ఉన్న మ్యాన్ హోల్స్ రోడ్లకు సమాంతరంగా చేయాలి. కానీ అడ్డగోలుగా..  కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ లతో కుమ్మక్కై అధికారులు దండుకుంటున్నారు. మ్యాన్ హోల్ కనిపిస్తే చాలు.. అవసరం లేకపోయినా రిపేర్లు చేసి.. లెక్కల్లో వేసుకుంటున్నారని ‘వెలుగు’లో వచ్చిన వార్తకు బల్దియా కమిషనర్ దానకిశోర్ చర్యలకు ఆదేశించారు.  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. గ్రౌండ్ లెవల్ లో మ్యాన్ హోల్స్ రిపేర్లలో గోల్ మాల్ జరగకుండా.. చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రెండు శాఖలకు చెందిన మ్యాన్ హోల్స్ మరమత్తులపై విచారణ చేపట్టాలని అధికారులను కోరినట్లు సమాచారం.