బస్సుల్లో మహిళల వీడియోలపై విచారణ చేయాలి : మంత్రి పొన్నం

బస్సుల్లో మహిళల వీడియోలపై విచారణ చేయాలి : మంత్రి పొన్నం

ఆర్టీసి బస్సుల్లో మహిళల ప్రయాణం సంబంధించి కావాలని కొన్ని వీడియోలు సృష్టిస్తున్నారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.  బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఈ వీడియోలను విచారించాలని కోరారు.  హుజురాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో వెళ్లిపాయాలు తీసుకుంటు వెళ్తున్నారని వీడియోలు వచ్చాయని వాటిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఛానల్స్ వైరల్ చేస్తున్నాయని చెప్పారు.  

రవాణా శాఖ మంత్రి గా డిసెంబర్ 9, 2023 నుండి మహిళకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్ సక్సెస్ అయిందని.. అప్పటి నుంచి మొదటి వాళ్లు కల్ల మంట జరుగుతుందని తెలిపారు.  ఆటో కార్మికుల గురించి చెబుతున్నారు.. మీకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం ఇష్టమా లేదా...? అని ప్రశ్నించారు మంత్రి. వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

 ఇప్పటి వరకు ఆర్టీసీలో 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని చెప్పారు. మహిళను అవమాన పరిచే విధంగా ఏం పని లేక  తిరుగుతున్నారనీ అవహేళనగా వస్తున్న వీడియోల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. మెట్రో వచ్చిన తరువాత 5 లక్షల మంది ప్రయాణికులు తిరుగుతున్నారని అప్పుడు ఆటోల మీద ప్రభావం పడలేదా...? అని అడిగారు.

 ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడుతుందని.. ఆ ప్రభావం పడకుండా సూచనలు చేయాలని కోరారు. షూటింగ్ లు చేసి పెట్టే వీడియోల పై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.