దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్​ విఫలం

దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్​ విఫలం
  • కోర్టు అనుమతి పత్రాలతో అధ్యక్ష భవనం వద్దకు వచ్చిన అధికారులు
  • అడ్డుకున్న యోల్ మద్దతుదారులు​ 

సియోల్: దేశంలో మార్షల్​లా విధించిన కేసులో నిందితుడు, అభిశంసనకు గురైన దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్​ సుక్​ యోల్ ను అరెస్ట్ చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైంది. కోర్టు అనుమతి పత్రాలతో శుక్రవారం ఉదయమే సియోల్​లోని ప్రెసిడెంట్ భవనానికి  కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్​(సీఐవో) అధికారులు చేరుకున్నారు. అయితే, అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న యూన్ మద్దతుదారులు వారిని అడ్డగించారు. 

దీంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు. 200 మంది ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ తమను బ్లాక్​ చేశారని, దీంతో భద్రతా కారణాల దష్ట్యా యూన్​ను అరెస్ట్​ చేయలేదని అధికారులు తెలిపినట్టు పేర్కొన్నది.

6 గంటలపాటు హైడ్రామా

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ యూన్‌‌‌‌ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్‌‌‌‌ లా’ విధించారు. దీంతో ప్రతిపక్షాలు ‘మార్షల్‌‌‌‌ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్‌‌‌‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. యూన్‌‌‌‌ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. అలాగే, ఈ కేసులో ఈ కేసులో విచారణకు సహకరించనందుకు అరెస్ట్​ వారెంట్ జారీ అయ్యింది.​ 

సీఐవో అధికారుల ఉదయం 7 గంటలకే అధ్యక్ష భవనం వద్దకు చేరుకోగా.. యూన్​ మద్దతుదారులు, సైన్యం, వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీఐవో చీఫ్‌‌‌‌ ఓహ్‌‌‌‌ డోంగ్‌‌‌‌ వున్‌‌‌‌ హెచ్చరించినా వారు వినలేదు. సుమారు 6 గంటలపాటు హైడ్రామా తర్వాత సీఐవో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది.