
- సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
కొమురవెల్లి, వెలుగు: రైతులకు పెట్టుబడి సాయం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. గురువారం కొమురవెల్లిలో రాంసాగర్ సర్పంచ్ తడూరి రవీందర్అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో మల్లారెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఎన్నికల్లో గెలవగానే డిసెంబర్ 9న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి మాట ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఎం కొమురవెల్లి మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దాసరి ప్రశాంత్, అత్తిని శారద తదితరులు పాల్గొన్నారు.