ముంబై: బంగారం, వెండిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఓ నగల వ్యాపారి 13.48 కోట్లు టోకరా పెట్టాడు. వ్యాపారి మాటలు నమ్మి మోసపోయిన ఓ కూరగాయలు అమ్మే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. టోర్రెస్ జ్యువెలర్స్ అధినేత బంగారం, వెండిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రజలకు ఆశ చూపాడు. బంగారంపై 48%, వెండిపై 96% అధిక లాభాలు ఇస్తామని.. వారం వారం పేమెంట్ చేస్తామని నమ్మించాడు. నగల వ్యాపారి మాటలు నిజమని నమ్మిన కొందరు కష్టపడి దాచుకున్న తమ సేవింగ్స్‌ను పెట్టుబడిగా పెట్టారు.
2024 జూన్ నుండి ఈ తతంగం మొదలైంది. మొదట్లో కొన్ని రోజులు కస్టమర్లకు లాభాలు కరెక్ట్ సమయానికి అందించారు. కస్టమర్ల నమ్మకం చూరగొన్నాక.. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. లాభాలు ఆశ చూసిన ప్రజలు మరిన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. గత రెండు నెలలుగా అసలుతో పాటు లాభాలు ఇవ్వడమ మానేశాడు నగల వ్యాపారి. మొత్తం 13.48 కోట్లు టోకరా పెట్టాడు. ఇందులో పెట్టుబడిన పెట్టిన ప్రదీప్ కుమార్ వైశ్యా అనే కూరగాయల చిరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని శివాజీ పార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు మొదలుపెట్టారు.
ALSO READ | యాపిల్ కంపెనీలో విరాళాల స్కాం : తెలుగు టెకీల లింక్.. 50 మంది ఉద్యోగుల తొలగింపు
టోర్రెస్ జ్యువెలర్స్ డైరెక్టర్లు, సీఈవోపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మిగితా పెట్టుబడిదారులు ఆందోళనకు గురై.. టోర్రెస్ జ్యువెలర్స్ దుకాణం ముందుకు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ యజమాని విదేశాల్లో ఉండవచ్చని, ఇతర నిందితులను గుర్తించేందుకు తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. అధిక లాభాలా ట్రాప్‌లో పడి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కళ్లముందే ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మారకుండా.. తీరా మొత్తం అయిపోయాక లబోదిబోమంటూ గుండెలు బాదుకోవద్దని పోలీసులు సూచించారు.