ఫుడ్ ​ప్రాసెసింగ్​ రంగంలో రూ.7,218 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఫుడ్ ​ప్రాసెసింగ్​ రంగంలో రూ.7,218 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. శనివారం హెచ్ఐసీసీలో నిర్వహించిన తెలంగాణ ఫుడ్​ కాంక్లేవ్​ తొలి ఎడిషన్​ మొదటి రోజు పలు సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఫుడ్ ​ప్రాసెసింగ్​ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ఐదేండ్లలోనే రూ.7 వేల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలకు పైగా ఎకరాల్లో ప్రాసెసింగ్​ జోన్​లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

వ్యవసాయంతో పాటు ఆక్వా, డెయిరీ, ఆగ్రో ప్రాసెసింగ్, ఆయిల్ ​ప్రాసెసింగ్​ రంగాల్లోనూ పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని చెప్పారు. శనివారం వచ్చిన పెట్టుబడులతో 58,458  మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి వివరించారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్, నీతి ఆయోగ్​మెంబర్​డాక్టర్​రమేశ్​చంద్, ఇండియన్​ డెయిరీ అసోసియేషన్​ అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ సోధి, డాక్టర్​ విజయ్​గుప్తా, శివకుమార్​తదితరులు పాల్గొన్నారు.