ఇన్ఫోసిస్‌‌, రిలయన్స్ రిజల్ట్స్‌‌పై ఇన్వెస్టర్ల చూపు

ఇన్ఫోసిస్‌‌, రిలయన్స్ రిజల్ట్స్‌‌పై ఇన్వెస్టర్ల చూపు

ముంబై: ఇన్ఫోసిస్‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ కంపెనీల క్యూ3 రిజల్ట్స్ ఈ వారం వెలువడనున్నాయి. మార్కెట్ డైరెక్షన్‌‌ను ఇవి నిర్ణయిస్తాయి. వీటితో పాటు ఇన్‌‌ఫ్లేషన్  డేటా, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు, క్రూడాయిల్ ధర, డాలర్ ఇండెక్స్‌‌పై  ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. 

యూఎస్ డాలర్‌‌‌‌తో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్‌‌లు పెరుగుతుండడంతో మార్కెట్‌‌ నుంచి ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ( ఎఫ్‌‌ఐఐలు) వెళ్లిపోతున్నారు. ఈ వారం ఇన్ఫోసిస్‌‌ (జనవరి 16) , రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ (జనవరి 16), హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్‌‌ (జనవరి 13), హెచ్‌‌డీఎఫ్‌‌సీ ఏంఎంసీ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌‌, యాక్సిస్ బ్యాంక్ (జనవరి16) తమ డిసెంబర్ క్వార్టర్‌‌‌‌ (క్యూ3) ఫలితాలను  ప్రకటించనున్నాయి. 

ఇండియా రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ నెంబర్లు సోమవారం, హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ డేటా  మంగళవారం వెలువడనున్నాయి. కిందటి వారం సెన్సెక్స్ 1,844 పాయింట్లు (2.32 శాతం), నిఫ్టీ 573 పాయింట్లు  పతనమయ్యాయి. 

మార్కెట్‌‌ నుంచి రూ.22,194 కోట్ల విత్‌‌డ్రా..

ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.22,194 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌‌ఐఐలు అమ్మారు. కంపెనీల క్యూ3 ఫలితాలు మెప్పించవనే అంచనాతో పాటు డాలర్ బలపడడంతో ఇండియా మార్కెట్ నుంచి ఫండ్స్ విత్‌‌డ్రా చేసుకుంటున్నారు.డీఐఐలు మాత్రం నికరంగా రూ.15,446 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.