గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ జోరుమీదుంది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి..గురువారం ఒక్కరోజే మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సెన్సెక్స్ దాదాపు 2 శాతం పెరిగింది. రెండు రోజుల మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ. 8.52 లక్షల కోట్లకు పెరిగింది. ఇది నెల తర్వాత సింగిల్ డే లో పొందిన అత్యుత్తమ లాభం.
ఫైనాన్షియల్, ఆటో, ఐటీ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో బెంచ్‌మార్క్ సెన్సెక్స్ గురువారం 1,436 పాయింట్లు పుంజుకుని రెండు వారాల గరిష్టానికి చేరుకుంది.BSE బెంచ్ మార్క్ సెన్సెక్స్1436పాయింట్లు పెరిగి 79వేల 943 వద్ద స్థిరపడింది.BSE- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు రోజుల్లో రూ.8లక్షల 52వేల239 కోట్లు పెరిగి 4కోట్ల50లక్షల47వేల345కోట్లకు చేరుకుంది.
ALSO READ | Rupee value: మరింత డీలా పడ్డ రూపాయి.. కారణం ఇదే
బిఎస్ఇ మిడ్‌క్యాప్ గేజ్ 0.89 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం ఎగబాకాయి. అన్ని రంగాల సూచీలు సానుకూలంగా ముగిశాయి. ఆటో అత్యధికంగా 3.66 శాతం ఎగబాకగా, ఆ తర్వాతి స్థానాల్లో బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ (2.34 శాతం), ఐటీ (2.31 శాతం), కన్స్యూమర్ డిస్ స్క్రేషనరీ (2.24 శాతం), టెక్ (2.19 శాతం), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (2.02 శాతం) , కమోడిటీస్(1.41 శాతం). BSEలో 2,395 స్టాక్‌లు లాభపడగా, 1,574 క్షీణించాయి మరో 117 లలో ఎటువంటి మార్పు లేదు.