ఫెడ్ రేట్ల కోతపై ఫోకస్‌‌‌‌

ఫెడ్ రేట్ల కోతపై ఫోకస్‌‌‌‌

న్యూఢిల్లీ: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఈ నెల 18 న జరిగే ఫెడ్ మీటింగ్‌‌‌‌పై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు.  యూఎస్‌‌‌‌లో  వడ్డీ రేట్ల కోత మొదలవుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఫెడ్ ఈ మీటింగ్‌‌‌‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని,  50 బేసిస్ పాయింట్లు కూడా తగ్గించే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.  ఫెడ్  వడ్డీ రేట్ల కోత మొదలు పెడితే  ఇండియాతో సహా గ్లోబల్‌‌‌‌ మార్కెట్లు పాజిటివ్‌‌‌‌గా కదలుతాయని స్వస్తికా ఇన్వెస్ట్‌‌‌‌మార్ట్‌‌‌‌ ఎనలిస్ట్  సంతోష్ మీనా అన్నారు. 

డాలర్ వాల్యూ తగ్గుతుందని, యూఎస్‌‌‌‌ ఈల్డ్స్‌‌‌‌ దిగొస్తాయని, ఫలితంగా ఇండియా మార్కెట్‌‌‌‌లోకి విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు వస్తాయని  చెప్పారు. యూఎస్ ఫెడ్ మీటింగ్‌‌‌‌తో పాటు జపాన్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ డేటా, బ్యాంక్  ఆఫ్ జపాన్ పాలసీ ప్రకటన కూడా మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. మరోవైపు ఇండియా  హోల్‌‌‌‌సేల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ డేటా, యూఎస్‌‌‌‌  ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌‌‌‌ డేటా, యూఎస్ జాబ్‌‌‌‌లెస్ క్లెయిమ్స్‌‌‌‌ డేటా ఈ వారం విడుదల కానున్నాయి.  కిందటి వారం  సెన్సెక్స్‌‌‌‌ 1,707 పాయింట్లు (2.10 శాతం) పెరగగా, నిఫ్టీ  504 పాయింట్లు ర్యాలీ చేసింది.
 
విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు..

ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.27,856 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌పీఐలు) మార్కెట్‌‌‌‌లో పెట్టారు. యూఎస్ ఫెడ్‌‌‌‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలపై ఇండియన్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.