జీడీపీ డేటాపై ఇన్వెస్టర్ల ఫోకస్‌‌‌‌

జీడీపీ డేటాపై ఇన్వెస్టర్ల ఫోకస్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జీడీపీ డేటాను ప్రభుత్వం ఈ నెల 30 న విడుదల చేయనుంది. దీని ప్రభావం మార్కెట్‌‌‌‌పై  ఉంటుంది. అలానే జులై నెలకు సంబంధించి ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ నెంబర్లు కూడా ఈ వారం వెలువడనున్నాయి. ఎఫ్‌‌‌‌ అండ్ ఓ మంత్లీ ఎక్స్‌‌‌‌పైరీ కూడా ఈ వారంలోనే ఉండడంతో, మార్కెట్‌‌‌‌లో ఓలటాలిటీ చూడొచ్చని ఎనలిస్ట్‌‌‌‌లు అంచనా వేస్తున్నారు. 

వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం ప్రకటించారు. ఎకానమీ రెసిషన్‌‌‌‌లోకి జారుకోదని చెప్పారు. ఆయన కామెంట్స్‌‌‌‌పై  సోమవారం  మార్కెట్‌‌‌‌ స్పందించనుంది.  గ్లోబల్ అంశాలపై కూడా ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు ట్రేడర్లకు సలహా ఇస్తున్నారు. కిందటి వారం సెన్సెక్స్ 649 పాయింట్లు (0.80 శాతం), నిఫ్టీ 282 పాయింట్లు లాభపడ్డాయి. ‘మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. యూఎస్ ఎకానమీ డేటా పాజిటివ్‌‌‌‌గా ఉండడంతో పాటు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ రెసిషన్‌‌‌‌లోకి జారుకోదనే నమ్మకం కలగడంతో మన మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. ఇజ్రాయిల్ – హమాస్ సీజ్ ఫైర్‌‌‌‌‌‌‌‌ చర్చలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం మార్కెట్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌గా ఉన్నాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.

మరిన్ని వార్తలు