న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం, మాక్రో ఎకనామిక్ డేటా, గ్లోబల్ అంశాలు ఈ వారం మార్కెట్ కదలికలను ప్రభావితం చేయనున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) యాక్టివిటీ, కంపెనీల క్యూ1 రిజల్ట్స్‌పై కూడా ట్రేడర్లు ఫోకస్ పెట్టాలన్నారు. ఆగస్టు 8 న మానిటరీ పాలసీ వివరాలను ఆర్‌బీఐ ప్రకటించనుంది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతధంగా కొనసాగిస్తారని ఎనలిస్టులు భావిస్తున్నారు.
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎల్‌ఐసీ, ఎంఆర్‌ఎఫ్‌ల క్యూ1 ఫలితాలు ఈ వారం విడుదల కానున్నాయి. ఈ షేర్లలో తీవ్ర కదలికలు ఉండొచ్చు. మరోవైపు ఫారిన్ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) కిందటి నెలలో నికరంగా రూ.32,365 కోట్లను మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. కానీ, ప్రస్తుత నెలలోని మొదటి రెండు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా రూ.1,027 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో రూ.26,565 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.