రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇన్వెస్టర్ల వేచిచూసే ధోరణి.. కొద్దిగా లాభపడ్డ మార్కెట్లు..

రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇన్వెస్టర్ల వేచిచూసే ధోరణి.. కొద్దిగా లాభపడ్డ మార్కెట్లు..

ముంబై: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండటంతో మంగళవారం (April 30) సెన్సెక్స్,  నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.   బ్లూ-చిప్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్,  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌లలో భారీ కొనుగోళ్లు,  నిరంతర విదేశీ మూలధన ప్రవాహం దేశీయ మార్కెట్లో జోష్​నింపింది. 30-షేర్ల సెన్సెక్స్​ 70.01 పాయింట్లు పెరిగి 80,288.38 వద్ద స్థిరపడింది. 

ఇంట్రాడేలో ఇది 442.94 పాయింట్లు పెరిగి 80,661.31 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 7.45 పాయింట్లు స్వల్పంగా పెరిగి 24,335.95 వద్ద ఆగింది.  సెన్సెక్స్ సంస్థలలో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్​సీఎల్​ టెక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్ లాభపడ్డాయి. మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) మంగళవారం రూ. 2,386 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.