Market Closing: మార్కెట్ల మహా పతనం: రూ.16 లక్షల కోట్లు ఆవిరి.. టాటాలకు లక్ష కోట్లు లాస్..

Market Closing: మార్కెట్ల మహా పతనం: రూ.16 లక్షల కోట్లు ఆవిరి.. టాటాలకు లక్ష కోట్లు లాస్..

Sensex-Nifty Crash: దలాల్ స్ట్రీట్ నేడు భారీ పతనాన్ని చూసింది. దీంతో మార్కెట్ల ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 742 పాయింట్ల పతనం కాగా మరో కీలక సూచీ నిప్టీ 2వేల 226 పాయింట్లను నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ వెయ్యి643 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ వెయ్యి837 పాయింట్లను కోల్పోయింది. దీంతో పెట్టుబడిదారుల సమపద నేడు రూ.16 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది.

వాస్తవానికి మార్కెట్ల పతనానికి అన్నింటి కంటే ముఖ్యమైన కారణం సుంకాల యుద్ధానికి ట్రంప్ గేట్లు తెరవటమే. దీంతో ప్రపంచ మార్కెట్లు భయాలకు లోనుకావటంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక చర్యల్లో భాగంగా తమ పోర్ట్ ఫోలియోలోని అనేక కంపెనీల షేర్లను విక్రయించారు. కొందరు తమ నష్టాలను తగ్గించుకోవటానికి ఇలా చేయగా మరికొందరు ఉన్న లాభాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా స్టాక్స్ విక్రయించినట్లు వెల్లడైంది. ట్రంప్ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మాంద్యంలోకి దిగజార్చగలవే భయాలు పెట్టుబడిదారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. 

Also Read : కుప్పకూలిన సుజ్లాన్ స్టాక్

ప్రస్తుతం మార్కెట్ల పతనంలో భారత మార్కెట్లు మెరుగైన స్థితిలోనే ఉన్నాయని వెల్లడైంది. ఎందుకంటే ఆసియా, యూపోపియన్ మార్కెట్లు నేడు 13 శాతం క్షీణతను చూసి సెన్సెక్స్-నిఫ్టీ కంటే ఎక్కువగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రపంచ మార్కెట్లలోని సూచీల కంటే రక్షణాత్మకంగా భారత మార్కెట్లు ఉండటంతో దిద్దుబాటు తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వాణిజ్య సుంకాలు అమెరికాలో వినియోగ షాక్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇది ప్రపంచ సరఫరా కొరతను కలిగించటంతో పాటు.., ప్రధాన కమోడిటీల్లో మందగమనానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నేడు తైవాన్ బెంచ్ మార్క్ సూచీల ట్రేడింగ్ నిలిపివేయబడింది. 

లక్ష కోట్ల కోల్పోయిన టాటా స్టాక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా గ్రూప్ ఎక్కువగా లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నిఫ్టీ సూచీలోని టాటాలకు చెందిన 6 షేర్లు భారీగా ప్రభావితం అయ్యాయి. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు పెద్ద ఎదురుదెబ్బ తిన్నాయి. ఈ ఆరు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల సంపదను రూ.లక్ష 28వేల కోట్ల మేర నష్టాన్ని కలిగించాయి. ప్రధానంగా నేడు నిఫ్టీ సూచీలో ట్రెంట్ స్టాక్ టాప్ లూజర్‌గా నిలిచింది.