వాట్సాప్ వాడుతున్నప్పుడు ఇతరులకు తెలియకుండా ఉండటం సాధ్యం కాదు. వాట్సాప్ యాప్ ఓపెన్ చేయగానే వేరే యూజర్లకు ‘ఆన్లైన్’అని కనిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక మెసేజ్ పంపినప్పుడు వాటిని ఎప్పుడు చూశామో తెలియకుండా ఉండాలంటే బ్లూటిక్స్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ, తిరిగి ఆన్‌లైన్‌లోకి రాగానే ఆ విషయం తెలిసిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వాట్సాప్‌కు కొంతకాలం దూరంగా ఉండాలన్నా కొంచెం చిక్కే. ఫేస్బుక్, ట్విట్టర్లాగా వాట్సాప్‌ను డిలీట్ చేయడం, తిరిగి ఇన్స్టాల్ చేయడం అంత ఈజీ కాదు. ఎప్పుడూ డాటా రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. మరైతే ఈ ఇబ్బందికి పరిష్కారం ఏంటి? అదే ‘వాట్సాప్ ఇన్విజిబుల్’.
ఇది కొత్త ఫీచర్ కాదు. ఎందుకంటే వాట్సాప్‌లో ‘ఇన్విజిబుల్’ అనే ఫీచరేమీ లేదు. అయితే వాట్సాప్ వాడుతున్నా, ఆ విషయం ఇతరులకు తెలియకుండా ఉండటం, లేదా వాట్సాప్ నోటిఫికేషన్స్‌కు దూరంగా ఉండేలా సెట్టింగ్స్‌ను మార్చుకోవడమే ‘వాట్సాప్ ఇన్విజిబుల్’. దీనివల్ల యూజర్లు వాట్సాప్ వాడుతున్నా మీ యాక్టివిటీ ఇతరులకు తెలియకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రతిసారి వచ్చే నోటిఫికేషన్స్వల్ల ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీ వాట్సాప్ యాక్టివిటీని ఇన్విజిబుల్గా మార్చుకోవచ్చు.
వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చిన తర్వాత ఎరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకుని, మెసేజ్‌లు చూసినా సెండర్స్‌కి తెలియదు. అయితే, మళ్లీ ఎరోప్లేన్ మోడ్ ఆఫ్ చేయగానే.. దానికి సంబంధించిన స్టేటస్ వాళ్లకు తెలిసిపోతుంది.
రికార్డ్ ఎ సైలెంట్
ఆఫీసులో పని చేస్తున్నప్పుడు వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ రింగ్‌టోన్ ఇబ్బందిగా ఉంటుంది. అలాగని ఫోన్ సైలెన్స్‌లో పెడితే కాల్స్ కూడా వినిపించవు. నోటిఫికేషన్స్ ఆఫ్ చేద్దామా అంటే కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లు రావొచ్చు. వాట్సాప్‌ను ఒక్కటే సైలెన్స్ గా ఉంచడానికి అవకాశం లేదు. అయితే దీనికో పరిష్కారం ఉంది. అదే సైలెన్స్రింగ్టోన్. అంటే మొబైల్లో రికార్డర్ ఆన్ చేసి, కొన్నిసెకండ్లపాటు సైలెన్స్‌గా ఉండండి. అంటే ఏ శబ్దం వినపడకుండా రెండు సెకండ్లపాటు సైలెన్స్‌నే రికార్డు చేయండి. దీనికో పేరు పెట్టి, సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కాల్, మెసేజ్‌కు రింగ్‌టోన్‌గా ఈ సైలెంట్ రికార్డింగ్‌ను సెట్ చేసుకోండి. ఏ మెసేజ్, కాల్ వచ్చినా సైలెంట్‌గా ఉంటుంది.
ఒకవేళ ఇబ్బందేం లేదనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్స్ ఆఫ్ చేయొచ్చు. దీనివల్ల వాట్సాప్‌లో మీకు మెసేజ్ వచ్చినా మీరు ఓపెన్ చేసేంతవరకు తెలియకుండా ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాస్ట్ సీన్‘నోబడీ’ సెలెక్ట్ చేసుకుంటే మీరెప్పుడు చివరిగా వాట్సాప్ చూశారో కూడా ఎవరికీ తెలీదు.
మీకు మెసేజ్ వచ్చినా వెంటనే నోటిఫికేషన్ రాకూడదనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ ఫోన్లలో నోటిఫికేషన్ లైట్ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్‌కు వెళ్లి, లైట్ సెలెక్ట్ చేసుకుని ‘నన్’ క్లిక్ చేయాలి. అలాగే మొబైల్ హోమ్‌స్క్రీన్‌పై వాట్సాప్ షార్ట్‌కట్ రిమూవ్ చేయాలి.
సెట్టింగ్స్ లోకి వెళ్లి, యాప్స్ సెలెక్ట్ చేసుకుని, వాట్సాప్‌ని ఫోర్స్ స్టాప్ చేయాలి. దీనివల్ల వాట్సాప్‌కు మొబైల్ డాటా టర్న్ ఆఫ్ అయి, ఎలాంటి మెసేజ్‌లు రావు.