జనగామ అర్బన్, వెలుగు : జనగామ సమీపంలోని శామీర్‌పేట మహిళా గురుకుల డిగ్రీ కాలేజ్‌లో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు మహిళా క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎం.హరిప్రియ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బోటనీ, మైక్రో బయాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు.
జనరల్ క్యాండిడేట్లకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు 50 శాతం మార్కులు ఉండాలని, పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హత ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా క్యాండిడేట్లు ఈ నెల 29 తేదీ లోపు కాలేజీలో అప్లికేషన్లు అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99496 98695, 88975 38351 నంబర్లను సంప్రదించాలన్నారు.