కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామి వారి కల్యాణానికి హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వాన పత్రం అందజేశారు. మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి అర్చకులు, సిబ్బంది మంగళవారం సీఎంకు ఆహ్వాన పత్రిక, స్వామివారి ప్రసాదం, ఫొటో, శేషవస్త్రాలను అందజేశారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆహ్వానపత్రికలను అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు.