మంత్రి కోమటిరెడ్డికి నోయిడా ఎక్స్ పోకు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ నోయిడాలో డిసెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్న 'భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా'కు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్ తో కలిసి 'మెస్సె ముంచన్ ఇండియా' సంస్థ అనే సంస్థ ఎక్స్ పోను నిర్వహించనుంది.

ఈ క్రమంలో చీఫ్ గెస్ట్ గా అటెండ్ కావాలని మంత్రి కోమటిరెడ్డికి సంస్థ సౌత్ ఇండియా హెడ్ వెంకటేషన్ రామన్ బుధవారం ఇన్విటేషన్ అందించారు. ఏటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ప్రదర్శించే ఈ ఎక్స్ పోలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వెయ్యికి పైగా సంస్థలు పాల్గొంటాయని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు.

తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కీరీ ఈ షోను ఓపెనింగ్ చేస్తారని వెంకటేషన్ రామన్  తెలిపారు. ఈ ప్రదర్శనలో టెక్నికల్ సెషన్స్, ప్రాడక్ట్ సొల్యూషన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయని వెల్లడించారు. రోజువారీగా ప్రదర్శనకు సంబంధించిన విజువల్ ప్రజెంటేషన్ ను మంత్రి కోమటిరెడ్డికి చూపించిన ప్రతినిధులు.. ఏటా నిర్వహిస్తున్న భౌమాకోన్ ఎక్స్ పో  ఇండియాకు వస్తున్న స్పందన గురించి వివరించారు.