ఐనవోలు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ఐనవోలు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

వర్దన్నపేట (ఐనవోలు), వెలుగు : హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఈనెల 11 నుంచి 18 వరకు కొనసాగనున్నది. ఈ బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కావాలని హైదరాబాద్​లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

అనంతరం మంత్రిని సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మానీ శేఖర్ రావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.