- మహారాష్ట్రలోని పుణెలో, పబ్ ఓనర్ల నిర్వాకం
పుణె: న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్‌కు ఎక్కువమందిని అట్రాక్ట్ చేసేందుకు ఓ పబ్ ఓనర్లు కొత్తగా ప్లాన్ చేశారు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి యువకులను రప్పించాలని అనుకున్నరు. అందుకు ఇన్విటేషన్లు కొట్టించారు. వాటితో పాటు బైకర్లకు హెల్మెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కండోమ్స్ ప్యాక్ చేయించారు. వాటన్నింటినీ తమ పబ్‌కు వచ్చిన పాత కస్టమర్లందరికీ పంపించారు. ఆ పార్సెల్‌ను అందుకున్న ఓ యువకుడు దానిని ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
బాక్స్ లో హెల్మెట్ కూడా..
మహారాష్ట్రలోని పుణె జిల్లా ముంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని హై స్పిరిట్స్ క్లబ్ న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటూ తమ పబ్‌కు తరచుగా వచ్చే కస్టమర్లకు ఇన్విటేషన్పంపింది. బైక్ మీద వచ్చేవాళ్లు హెల్మెట్ యూజ్ చేయాలని, మద్యం తాగి బండ్లు నడపొద్దని సూచిస్తూ, ఓ గిఫ్ట్ ప్యాక్‌ను పంపింది. అందులో బైకర్లకు హెల్మెట్‌తో పాటు, డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరం మేరకు కండోమ్స్ యూజ్ చేయాలని చెప్పకనే చెప్పినట్లయింది.
గిఫ్ట్ ప్యాక్‌ను ఓ వ్యక్తి ఫేస్బుక్లో పెట్టడంతో వైరల్ కాగా, కాంగ్రెస్ నేతలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చీప్ ప్రచార ప్లాన్లతో యూత్‌ను ఖరాబ్ చేస్తూంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు పబ్ ఓనర్లపై కేసు పెట్టి ఈవెంట్‌ను రద్దు చేయించేపనిలో పడ్డారు. అయితే, తమ రెగ్యులర్ కస్టమర్లయిన 40 మందికి మాత్రమే గిఫ్ట్‌లు పంపామని పబ్ ఓనర్లు చెప్తున్నారు.