
కోల్బెల్ట్, వెలుగు: ఈనెల 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్డే పరేడ్కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్నేషనల్క్రీడాకారిణి తుమ్రమ్సత్యభామను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ బాధ్యులు శ్యాంసుందర్రావు, కనపర్తి రమేశ్ తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతం కెరమెరికి చెందిన క్రీడాకారిణికి ఆహ్వానం రావడం గర్వంగా ఉందన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు.