
హైదరాబాద్, వెలుగు: నాగభైరవ సాహితీ పురస్కారం 2025 కోసం రచయితలు తమ రచనలు పంపాలని కోరారు. ఈ మేరకు నాగభైరవ సాహిత్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. కవి నాగభైరవ కోటేశ్వరరావు పేరుతో ఏపీలోని ఒంగోలులో ఈ అవార్డును నెలకొల్పారు. ఈ ఏడాది పురస్కారానికి గాను అనువాద సాహిత్య రచనలను ఆహ్వానిస్తున్నారు.
2021 నుంచి 2024 మధ్య ప్రచురితమైన అనువాద సాహిత్యం మాత్రమే పోటీకి పంపాలని ఆదినారాయణ తెలిపారు. ఒక్కొక్కరు నాలుగేసి పత్రులను పంపించాలని సూచించారు. మే 10వ తేదీ వరకు తమ అనువాద రచనలను పంపించాల్సి ఉంటుందని చెప్పారు. ఆగస్టు 17న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849799711 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.