జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్) 2024-–25 విద్యా సంవత్సరానికి కింది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సు, సీట్ల వివరాలు: బీఎస్సీ నర్సింగ్‌లో 94 సీట్లు, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు: 87 సీట్లు ఉన్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 హయ్యర్/ సీనియర్ సెకండరీ పరీక్ష(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బోటనీ & జువాలజీ) ఉత్తీర్ణతతో పాటు నీట్-యూజీ 2024లో అర్హత సాధించి ఉండాలి..
సెలెక్షన్ ప్రాసెస్: నీట్-యూజీ 2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సెలింగ్ తదితరాల ఆధారంగా సీటు
కేటాయిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు www.jipmer.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.