ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో అడ్మిషన్లకు ఆహ్వానం

ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో అడ్మిషన్లకు ఆహ్వానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హిమాయత్ నగర్ లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో అడ్మిషన్లను ఆహ్వానిస్తున్నట్లు కాలేజీ డైరెక్టర్ సతీశ్​చందర్ తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం(పీజీడీజే) కోర్సు వ్యవధి 12 నెలలు, డిప్లొమా ఇన్ జర్నలిజం (డీజే) ఆరు నెలలు, డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(డీటీవీజే) కోర్సు 6 నెలలు ఉంటాయని, వీటికి కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలన్నారు.

సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం(సీజే) కోర్సు 3 నెలలు ఉంటుందని, దీనికి టెన్త్​పాస్​అయి ఉంటే సరిపోతుందన్నారు. ఈ కోర్సులను రెగ్యులర్ లేదా కరస్పాండెన్స్ (దూరవిద్య)లో చేసే వెసులుబాటు ఉందన్నారు.

తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఎంచుకోవచ్చని, ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివరాలకు 98485 12767, 83415 58346 లను సంప్రదించవచ్చాన్నారు. www.apcj.in  వెబ్ సైట్ ద్వారా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు ఫారమ్​పొందవచ్చన్నారు. అప్లికేషన్లు ఈ నెల 19 వరకు తీసుకోవచ్చని, అడ్మిషన్లకు చివరి తేదీ ఈ నెల 28 అని తెలిపారు.