
2023– 24 విద్యా సంవత్సరానికి ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (పీజీడిజె)– ఏడాది, డిప్లొమా ఇన్ జర్నలిజం (డిజె)– 6 నెలలు, డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (డిటీవీజె)– 6 నెలలు, సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (సిజె)– (3 నెలలు) కోర్సుల్లో అడ్మిషన్స్ అందుబాటులో ఉన్నాయి.
అర్హత: సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజంకు టెన్త్ విద్యార్హత కాగా, మిగిలిన కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులు రెగ్యులర్‌గా లేదా కరస్పాండెన్స్ (డిస్టెన్స్) లోనూ చేయవచ్చు. ఆన్లైన్ తరగతుల సౌకర్యం ఉంది. తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది.
దరఖాస్తులు:అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారం పొందడానికి ఆగస్టు 21 చివరితేది. అడ్మిషన్స్ పొందడానికి సెప్టెంబర్ 2 చివరి తేదీగా నిర్ణయించారు. వివరాలకు 9848512767, 7286013388 ఫోన్ నంబర్లకు లేదా www.apcj.in వెబ్సైట్లో సంప్రదించాలి.