ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్‌‌కు IOC ఆమోదం.. 128 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ!

ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్‌‌కు IOC ఆమోదం.. 128 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ!

వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లు ఎన్ని గెలిచినా..  ఒలింపిక్స్ లో సాధించే ఒక్క పతకం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో క్రికెట్ లాంటి జెంటిల్ మెన్ గేమ్ లేకపోవడంతో చాలా మంది క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే క్రికెట్ అభిమానులకి గుడ్ న్యూస్ చెబుతూ ఒలింపిక్స్‌లోకి మళ్లీ క్రికెట్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 

ఇకపై ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉంటుంది. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ 2028లో లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్ ఆడేందుకు అనుమ‌తి ఇవ్వడం జరిగింది. అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్ర‌తిధిని క్రికెట్‌కు ఆమోదం తెలిపిన‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టన చేశారు. 1900లో జరిగిన తొలిసారి ఒలింపిక్స్ లో కనిపించిన ఈ జెంటిల్మెన్ గేమ్ 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఒలింపిక్స్ లో కొత్తగా చేర్చాలనుకున్న ఐదు క్రీడల్లో క్రికెట్ కూడా ఉందని ఐఓసీ అధ్య‌క్షుడు థామ‌స్ బాచ్ ముంబై ఎగ్జిక్యూటీ బోర్డు మీటింగ్‌లో ఈ విష‌యాన్ని తెలిపారు. 

వీటితో పాటు బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌, లాక్రోసీ క్రీడ‌ల‌ను ఒలింపిక్స్‌లో ఆడించే ఛాన్సు ఉంది. గత ఫిబ్రవరిలో ఒలింపిక్స్ లో ఉండబోయే 28 స్పోర్ట్స్ జాబితాలో క్రికెట్ కు చోటు దక్కలేదు. అయితే జులై నెలలో ఐఓసీ పరిశీలన కోసం ఎంపిక చేసిన 9 క్రీడల జాబితాలో క్రికెట్ కు చోటు దక్కడంతో జెంటిల్మెన్ గేమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. క్రికెట్ తోపాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ లాంటి స్పోర్ట్స్ ను ఒలింపిక్స్ లోకి తీసుకునేందుకు ఐఓసీ పరిశీలించింది. ఎల్ఏ28 కమిటీ ముందు ఐసీసీ ప్రెజంటేషన్ కూడా ఇచ్చింది. ఇందులో మెన్స్, వుమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో టీ20 క్రికెట్ నిర్వహించాలని సిఫారసు చేసింది.