విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్ లోనే కాదు విశ్వం మొత్తం వ్యాపించింది. కోహ్లీకి ఉన్న అసాధారణ క్రేజ్ ఏకంగా క్రికెట్ ని ఒలింపిక్స్ లో చేర్చేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది ఫాలోవర్లను కలిగిన విరాట్ కోహ్లీ 120 ఏళ్ళ తర్వాత మళ్ళి క్రికెట్ ని ఒలింపిక్స్ లో ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విషయాన్ని స్వయంగా లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇటలీ ఒలింపిక్ ఛాంపియన్ షూటర్, LA28లో స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని వెల్లడించాడు.
ముంబైలోని IOCకి పిచ్ చేస్తున్నప్పుడు భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ యొక్క ఫాలోయింగ్ ని పరిశీలించినట్టు తెలుస్తుంది. "సోషల్ మీడియాలో 340 మిలియన్ల మంది ఫాలోవర్లతో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న అథ్లెట్లలో నా మిత్రుడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇది లీ బ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ మరియు టైగర్ వుడ్స్ కలిపిన దానికంటే ఎక్కువ. విరాట్ క్రేజ్ ని పరిగణలోకి తీసుకొని క్రికెట్ ని ఒలింపిక్స్ లో చేర్చడానికి మరింత ఆసక్తి చూపించారు".అని కాంప్రియాని తెలిపాడు.
కాగా.. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్‌ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఆమోదం తెలిపింది. సోమవారం ముంబైలో జరిగిన ఐఓసీ సమావేశంలో.. క్రికెట్‌తో పాటు సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్సె (సిక్సెస్), స్కాష్ క్రీడలు కూడా 2028 ఒలింపిక్స్‌లో భాగం చేయబోతున్నట్లు తెలిపింది. అయితే, ఇద్దరు సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఓటింగ్ ఏకగ్రీవంగా జరగలేదు. ఆరేసి జట్లు చొప్పున పురుషుల, మహిళల క్రికెట్ జట్లు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనున్నాయి.