ఐ ఓఎస్18 (iOS18), డెవలపర్ బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. సాధారణ యూజర్ల కోసం ఐఓఎస్18 అధికారికంగా సెప్టెంబరు 2024లో లాంచ్ అవుతుంది. ఐఓఎస్18లో రాబోయే కొన్ని ఫీచర్లలో ఓఎస్ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్‌లో యాప్‌లు, విడ్జెట్స్ ఏర్పాటుకు ఆధునిక పద్ధతితో సహా అనేక కస్టమైజ్డ్ ఆప్షన్స్ తేనుంది.
- ప్రస్తుతం డాక్ పైన కూడా ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఐకాన్స్, విడ్జెట్స్‌ను ఫ్రీగా సెట్ చేయొచ్చు. డార్క్ లేదా లెంటెడ్ థీమ్‌ల వంటి విజువల్ ఎఫెక్ట్స్ కూడా అప్లయ్ చేయొచ్చు.
- ఫొటోల యాప్ కూడా ఫొటో లైబ్రరీలను ఒకే వ్యూలో చూసేందుకు రీ–డిజైన్ చేసింది. కొత్త కలెక్షన్‌తోపాటు రోజువారీ ఇష్టమైన ఫొటోలను హైలైట్ చేసే వ్యూ కూడా ఉంటుంది.
- థర్డ్ పార్టీ యాప్ ఇంటిగ్రేషన్ పర్మిషన్ ఇస్తుంది. మెసేజెస్ యాప్‌లోని శాటిలైట్ మెసేజ్ సెల్యులార్ లేదా వై-ఫై లేకుండా కనెక్టివిటీని అందిస్తుంది.
- ఐ మెసేజ్ (iMessage) అప్‌గ్రేడ్‌తో కొత్త టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఫార్మాటింగ్ ఆప్షన్స్, మెసేజ్ షెడ్యూలింగ్‌ను కలిగి ఉంది.
- ఇందులో ప్రత్యేకమైన ఫీచర్ ఆపిల్ ఇంటెలిజెన్స్. లాంగ్వేజీపై అవగాహన, ఇమేజ్ క్రియేషన్ వంటి టాస్క్‌లను బెటర్ చేసేందుకు జనరేటివ్ మోడల్స్ పనిచేస్తాయి.