నిన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచో లెక్క : 420 కాదు.. 318 అనాలి

నిన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచో లెక్క : 420 కాదు.. 318 అనాలి

420 అనగానే టక్కున మనకు గుర్తొచ్చే పదం దొంగ.  లా చదవకపోయినా, ఏమీ తెలియకపోయినా 420 అంటే మాత్రం చాలామందికి తెలుసు. సమాజంలో తరుచూ దొంగతనాలు, చీటింగ్ లు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి, పోలీస్ స్టేషన్ లో 420 సెక్షన్ మీద కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతుంటాయి. అయితే ఆ పదం రాజకీయ నాయకులు ఇతర పార్టీ నాయకులను విమర్శించడానికి, సినిమాల్లో సెటైర్లు వేయడానికి బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులు కూడా ఈ నెంబర్ అందరికీ దెగ్గరైంది. దీని మీద బాలావుడ్ లో శ్రీ 420, చాచీ 420 అనే సినిమాలు కూడా తీశారు. తెలుగు సినిమాల్లో కూడా చాలా సందర్భంగాల్లో ఈ నెంబర్ వాడారు. 

ఇండియన్ పీనల్ కోడ్ 1860లో సెక్షన్ 420 అంటే మోసం లేదా దొంగతనం నేరాన్ని గురించి వివరించేది.  కానీ ఇటీవల భారతీయ శిక్షా స్మృతిలో కొన్ని మార్పుల చేయడం వల్ల దొంగతనం, మోసం నేరాల గురించి, వాటికి పడే శిక్షల గురించి వివరించే సెక్షన్ మారిపోయింది. ఇక మీదట సెక్షన్ 420ని 318 నెంబర్ భర్తీ చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో 2024 జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత(BNS) 2023 చట్టం అమలులోకి వచ్చింది. దీంతో నేరాలు, వాటికి వేసే శిక్షల్లో మార్పుల చోటుచేసుకున్నాయి.  

ఇకమీదట పోలీసులు 420కి బదులు 318 సెక్షన్ ను ఉపయోగిస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనే చట్టం బ్రిటిష్ కాలం నాటిది. ఈ చట్టాన్ని రూపొందించి 164 ఏళ్లు అవుతుంది. మారుతున్న కాలానికి నేరాలకు విధించే శిక్షలు కూడా మారాలని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో మూడు కొత్త చట్టాలకు పార్లమెంట్ లో ఆమోదం తెలిపింది.