మోస్ట్ వాంటెడ్ మొబైల్ కంపెనీ అయిన యాపిల్.. తన కొత్త మోడల్స్ ను ఇవాళ విడుదల చేస్తోంది. ఐ ఫోన్ 11, ఐ ఫోన్ 11 ప్రో, ఐ ఫోన్ 11 ప్రో మ్యాక్స్ లను ఇవాళ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రం క్యూపర్టినో నగరంలోని కంపెనీ హెడ్ క్వార్టర్ లో ఈ ప్రోగ్రామ్ జరగనుంది. స్టీవ్ జాబ్స్ థియేటర్ లో స్పెషల్ హార్డ్ వేర్ ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ లాంచింగ్ ఈవెంట్ ను.. భారత కాలమానం ప్రకారం… రాత్రి 10.30 గంటలకు లైవ్ లో చూడొచ్చు. యూట్యూబ్ లోనూ స్పెషల్ స్ట్రీమింగ్ ఉంది. ఈ లైవ్ ఈవెంట్ ను యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ చేయడం ఇదే తొలిసారి. రెస్పాన్స్ ఎలా ఉండబోతుందన్నదానిపై భారీ అంచనాలు ఉన్నాయి.
యాపిల్ తీసుకొస్తున్న కొత్త మోడల్స్ నెక్స్ట్ జెనరేషన్ స్మార్ట్ ఫోన్లుగా చెబుతున్నారు. ఐతే.. వీటికి ఐ ఫోన్ 11 సిరీస్ లోనే రిలీజ్ చేస్తారన్న టాక్ ఉంది. ఐతే.. అధికారికంగా కంపెనీ ఆ వివరాలను ఇవాళ ప్రకటించాల్సి ఉంది.
ఈ న్యూ మోడల్స్ లో కెమెరా అప్ గ్రేడ్ బిగ్గెస్ట్ అప్ డేట్ అని చెబుతున్నారు. మల్టీ కెమెరా సిస్టమ్ తో తొలిసారి రిలీజ్ చేయబోతున్నారు. ఐ ఫోన్ 11 ప్రొ, ఐ ఫోన్ 11 ప్రో మ్యాక్స్ మోడల్స్ లో వెనుకవైపున స్క్వేర్ షేప్ లో 3 కెమెరాలు ఉండబోతున్నాయి. ఈ మోడల్స్ లో ఇది ఓ హైలైట్ గా చెప్పుకుంటున్నారు.
ఈ ఏడాది తొలి అర్ధభారంగా ఎక్కువగా అమ్ముడుపోయిన ఐ ఫోన్ XR, XS, XS మ్యాక్స్ మోడల్స్ ను ఈ కొత్త మోడల్స్ రీప్లేస్ చేస్తాయన్న అంచనాలు హెవీగా ఉన్నాయి.
ఇవాళ్టి ఈవెంట్ లో.. యాపిల్ వాచ్ సిరీస్ 5, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా లాంచ్ చేసే చాన్సుంది.