ఐ ఫోన్... యూత్ డ్రీమ్ ఫోన్. లుక్, కెమెరా, ఫీచర్స్, సెక్యూరిటీ కోసం చాలామంది యాపిల్ ఐఫోన్ కొనడానికి మొగ్గు చూపుతుంటారు. కస్టమర్ల ఇంట్రెస్ట్ కు తగ్గట్లుగానే కంపెనీ.. ఏటా కొత్త మోడళ్లు అందుబాటులోకి తెస్తుంది. సరికొత్త ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్లకు యాపిల్ డిమాండ్ కు తగ్గట్లే రేట్లు నిర్ణయిస్తుంది. ధర ఎంత పెరిగినా యాపిల్ ఫోన్ కొనేవారు మాత్రం తగ్గడం లేదు. అప్పుచేసైనా సరే లో ఎండ్ మోడల్ ఫోన్లు కొంటున్నారు. దీంతో 2022 క్వార్టర్ 4 లో ఎక్కువ మొబైల్ ఫోన్లు అమ్ముడుపోయిన జాబితాలో ఐఫోన్ 13 నిలిచింది.
కౌంటర్ పాయింట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఐఫోన్ 13 4 శాతం మార్కెట్ షేర్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో శామ్ సంగ్ గెలాక్సీ M13, రెడ్ మీ A1 3 శాతం అమ్మకాలు జరిపి రెండో స్థానంలో ఉన్నాయి. అయితే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే భారత్ లో యాపిల్ ఎక్కువ అమ్మకాలు జరపడం ఇదే తొలిసారి.