ఐఫోన్ లవర్స్కి గుడ్న్యూస్..80వేల ఫోన్ కేవలం రూ.35 వేలకే..

ఐఫోన్ లవర్స్కి గుడ్న్యూస్..80వేల ఫోన్ కేవలం రూ.35 వేలకే..

ఐఫోన్ కొనాలకుంటున్నారా..ఆఫర్లకోసం ఎదురుచూస్తున్నారా..అయితే మీకోసం భారీ తగ్గింపు ధరలతో ఐఫోన్ అందుబాటులో ఉంది.అద్బుతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్లతో కూడిన iPhone15పై లిమిటెడ్ ఆఫర్ తో రూ.18వేల తగ్గింపు అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్, ఎక్ఛేంజ్ ఆఫర్లతో కలిపి అమెజాన్ లో రూ.34వేల 200 లకే లభిస్తోంది.  

ఐఫోన్15 స్మార్ట్ఫోన్128GB అసలు ధర రూ.79వేల900 నుంచి రూ.18వేల డిస్కౌంట్ఇస్తోంది. అంటే అమెజాన్లో ఈ స్మార్ట్ఫోన్ రూ.61వేల900కి లభిస్తోంది. ఇదే కాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అమెజాన్ పే, ICICI క్రెడిట్కార్డ్ కస్టమర్లు అదనంగా 5శాతంక్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ప్రైమ్ కాని కస్టమర్లకోసం కొనుగోలుపై 3శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

ఇక పాత ఐఫోన్14ను ఎక్ఛేంజ్ చేసుకోవాలనుకునేవారికి మరింత డిస్కౌంట్ఇస్తోంది.ఎక్ఛేంజ్ఆఫర్ ద్వారా రూ.27వేల700 వరకు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.డిస్కౌంట్ తర్వాత ఐఫోన్15 రూ.34వేల200లకే లభిస్తోంది.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు

ఐఫోన్15 సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ ఫ్రూఫ్ కోసం IP68 రేటింగ్‌తో రెసిస్టెన్సీ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్సెట్లో స్క్రీన్ 6.1ఇంచుల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఉంటుంది. దీంతోపాటు డైనమిక్ ఐలాండ్, డాల్బీ విజన్ ,2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. 

ALSO READ | టెక్ స్టార్టప్‌‌‌‌లలోకి రూ.21,500 కోట్ల పెట్టుబడులు

ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్, 4nm ప్రాసెస్‌పై నిర్మితమైంది. ఇది యాప్‌లు, గేమ్‌లలో చాలా స్మార్ట్ గా వేగంగా పనిచేస్తుంది. ఇక స్టోరేజీ విషయానికొస్తే 512GB వరకు స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. ఇది iOS 18.2.1 పై పనిచేస్తుంది. 

ఇక కెమెరా విషయానికొస్తే.. ఫోటోగ్రఫీకోసం ఐఫోన్ 15 48MP ప్రధాన సెన్సార్‌ను 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో జత చేయబడింది. 2x టెలిఫోటో సామర్థ్యాన్ని అందిస్తుంది. సెల్ఫీ ప్రియులు హై రెజల్యూషన్ ఫోటోలు,వీడియో కాల్‌ల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను ఇష్టపడతారు. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6 ,బ్లూటూత్ 5.3, ఛార్జింగ్ కోసం పరికరం వైర్డు ,వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు చేస్తుంది.