iPhone17 Air త్వరలో వచ్చేస్తుందోచ్..దీని ఫీచర్లపై అంచనాలు మామూలుగా లేవు

iPhone17 Air త్వరలో వచ్చేస్తుందోచ్..దీని ఫీచర్లపై అంచనాలు మామూలుగా లేవు

ఆపిల్ తన సరికొత్త మోడల్ iPhone 17 Airతో ఐఫోన్ లైనప్ ను షేక్ చేయబోతోంది. ఒకప్పుడు మినీని ఐఫోన్17 ప్లస్ భర్తీ చేసినట్లుగా 2025 సిరీస్‌లో ప్లస్‌ మోడల్ ను ఐఫోన్ 17 భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. టెక్ నిపుణుల అంచనాలు నిజమైతే ఐఫోన్ 17 లైనప్‌లో రెగ్యులర్ ఐఫోన్ 17, ప్రో ,ప్రో మాక్స్ కు చెందిన ఫీచర్లతో పాటు అద్బుతమైన కొత్త ఫీచర్లతో కస్టమర్లను కట్టిపడేస్తుంది. సొగసైన, తేలికైన ఫోన్‌ను కోరుకునే కస్టమర్లకోసం ఈ కొత్త ఐఫోన్ 17 ఎయిర్ బెస్ట్ వన్ కావొచ్చంటున్నారు. 

ఐఫోన్ 17 ఎయిర్ లో అతిముఖ్యమైన ఫీచర్ దాని సన్నని డిజైన్ కావచ్చు. ఇప్పటివరకు ఉన్న యాపిల్ ఐఫోన్లలో అత్యంత సన్నని ఐఫోన్ అంటే iPhone 17Air. ఇది 5.5మిమీ మందం ఉండొచ్చిన అంచనా వేస్తున్నారు. స్టైలీష్ గా ఉంటుంది. అంటే దీని బ్యాటరీ కూడా అత్యంత చిన్నదిగా ఉంటుందని భావిస్తున్నారు. 

కొత్త శైలిలో బ్యాక్ కెమెరా

మూడు కెమెరాలు కలిగిన ప్రో మోడల్‌ల మాదిరిగా కాకుండా ఐఫోన్ 17 ఎయిర్‌లో కేవలం ఒక 48MP వెనుక కెమెరా మాత్రమే ఉండవచ్చు. దీనిని క్షితిజ సమాంతర కెమెరా బార్‌లో ఉంటుందంటున్నారు. దీని డిజైన్ లేటెస్ట్ గా ఇతర ఐఫోన్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. 

పెద్ద డిస్ ప్లే

ఐఫోన్ 17 ఎయిర్ లో అల్ట్రా-స్లిమ్ బిల్డ్ ఉన్నప్పటికీ 6.6 నుంచి 6.7-అంగుళాల పెద్ద స్క్రీన్‌తో రావచ్చని అంచనా..ఇది స్టాండర్డ్ ఐఫోన్ 17 కంటే పెద్దదిగా ఉంటుంది. స్లిమ్ బాడీతో పెద్ద స్క్రీన్ అందించేందుకు యాపిల్ లక్ష్యంగా 17ఎయిర్ వస్తుందంటున్నారు. 

ఆపిల్ సొంత 5G మోడెమ్

ఆపిల్ క్వాల్‌కామ్ నుండి కొనుగోలు చేయడానికి బదులుగా ఐఫోన్ 17 ఎయిర్‌లో దాని స్వంత 5G మోడెమ్‌ను ఉపయోగించవచ్చు. ఈ మోడెమ్ 4Gbps వరకు డౌన్‌లోడ్ వేగాన్ని సపోర్ట్ చేయగలదు. అయితే ఇది mmWave 5Gకి సపోర్ట్ చేయకపోవచ్చు. 

A19 చిప్ ద్వారా ఆధారితం

ఐఫోన్ 17 ఎయిర్ స్టాండర్డ్ A19 చిప్‌పై పనిచేస్తుందని భావిస్తున్నారు. ప్రో మోడల్స్ వేగవంతమైన A19 ప్రోను పొందగలిగినప్పటికీ A19 ఇప్పటికీ చాలా మంది కస్టమర్లకు వేగవంతమైన, స్మార్ట్ పనితీరును అందిస్తుంది. ఇది ప్రో మోడల్స్ కంటే ఆపిల్ ఎయిర్ ధరను తక్కువగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

►ALSO READ | iPhone : ఐ ఫోన్లను ఎగబడి కొంటున్న ఇండియన్స్.. 3 నెలల్లో 30 లక్షల సేల్స్ తో రికార్డ్ బద్దలు