iPhone 17 Pro Max:ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ డిజైన్ లీక్డ్..ఆకట్టుకుంటున్న హారిజెంటల్ కెమెరా..మరిన్ని వివరాలు

iPhone 17 Pro Max:ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ డిజైన్ లీక్డ్..ఆకట్టుకుంటున్న హారిజెంటల్ కెమెరా..మరిన్ని వివరాలు

ఫేమస్ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ తన కొత్త iPhone 17 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.. iPhone17, iPhone17 Plus, iPhone17 slim, iPhone17 Proలతోపాటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న iPhone 17 Pro Maxను కూడా త్వరలో లాంచ్ చేయనుంది. అయితే ఇటీవల iPhone 17 Pro Max ఐఫోన్ కు సంబంధించిన ఇమేజ్ లీకయింది. 

Majin Bu (@MajinBuOfficial) అనే లీకర్ షేర్ చేసిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్  ఇమేజ్ సూపర్ గా ఉంది.. హారిజెంటల్ కెమెరాలతో అద్భుతంగా ఉంది. చూపుతిప్పు కోనివ్వడం లేదు.ఇది మొదటిసారి Whlsacom అనే యూట్యూబ్  ఛానెల్ ద్వారా దీని ఇమేజ్ బయటికి వచ్చింది. అయితే iPhonePro మాత్రం గత వెర్షన్లలో వచ్చిన విధంగా ట్రయాంగిల్ కెమెరా డిజైన్ ఉండనుందని రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ 17సిరీస్ ఐఫోన్ల గురించి యాపిల్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 
 

ఆపిల్ తన ఐఫోన్ లైనప్ iPhone 17 సిరీస్ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ సీరిస్ ను 2025 సెప్టెంబర్ లో రీలీజ్ కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యాపిల్ మొదటిసారిగా iphone 17  సిరీస్ ద్వారా అండర్ డిస్ ప్లే ఫేస్ ID సిస్టమ్ తో ప్రవేశపెడుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఎడ్జ్ టు ఎడ్జ్ OLED డిస్ ప్లే తో వస్తుందని భావిస్తున్నారు 

అదనంగా, ప్రో మోడల్స్‌లో మెరుగైన ఆప్టికల్ జూమ్, శాటిలైట్ కనెక్టివిటీ అప్‌గ్రేడ్‌లకు మద్దతు కోసం సరికొత్త పెరిస్కోప్ కెమెరా సిస్టమ్‌ ఉంటుందని అంచనా. యాపిల్ తన ఆపిల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్‌ను కస్టమర్ పరిచయం చేయనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.