iPhone 17 Series: ఐఫోన్17 ప్రో, ఐఫోన్17 ఎయిర్ స్పెసిఫికేషన్లు లీక్..కెమెరా,డిజైన్ అదుర్స్

iPhone 17 Series: ఐఫోన్17 ప్రో, ఐఫోన్17 ఎయిర్ స్పెసిఫికేషన్లు లీక్..కెమెరా,డిజైన్ అదుర్స్

ఐఫోన్ 17సిరీస్ వచ్చే ఏడాదిలో రానుంది. ఈ నెక్ట్స్ జరేషన్ ఐఫోన్ల గురించి లీక్ లు ఇప్పటికే ఆన్లైన్ కనిపిస్తున్నాయి. తాజా లీకులు ఆపిల్ 2025 ఐఫోన్ లైనప్లో ప్రత్యేక ఫీచర్లతో అద్బుతమైన మార్పులను సూచిస్తున్నాయి. iPhone 17Pro, iPhone 17Air రెండూ కెమెరా పనితీరు, డిజైన్లు అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ లో 48 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాతో వస్తున్నాయని హైటాంగ్ ఇంటర్నేషనల్ టెక్ రీసెర్చ్ విశ్లేషకుడు జెఫ్ ఫు రిపోర్టు చెబుతున్నాయి. ఇది 12 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ నుంచి గణనీయమై అప్ గ్రేడ్ చేయబడింది. అయితే ఫ్రంట్ కెమెరా ఐఫోన్ 16 ప్రో సిరీస్ మాదిరిగానే 12 మెగా పిక్సెల్ వద్ద ఉంటుదని భావిస్తున్నారు. 

Also Read:-దీపావళి సామాన్లపై అమెజాన్‌‌‌‌లో ఆఫర్లు

ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ 12GB RAM తో వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రో వెర్షన్ లలో 8GB మాత్రమే  RAM ఉంది. ఇది ఫోన్ సామర్థ్యం, మల్టీ టాస్కింగ్  టోటల్ గా ఫోన్ పనితీరును AI ఆధారిత ఫీచర్లకోసం మెరుగు పరుస్తుందని అంటున్నారు. ఈ లేటెస్ట్ వెర్షన్ లో మెటలెన్స్ అనే కొత్త టెక్నాలజీతో ఫేస్ ఐడీ కోసం ప్రత్యేక విభాగం ఉంటుందని అంచనా.  

స్పెసిఫికేషన్స్.. 

ఐఫోన్ 17 ప్రో 6.3 అంగుళాల డిస్ ప్లేను, ప్రో మ్యాక్స్ 6.9 అంగుళా డిస్ ప్లేలతో పాత వెర్షన్ల స్క్రీన్ సైజులతో వస్తున్నాయి. రెండు మోడల్స్ Apple రాబోయే A19 ప్రో చిప్ పవర్ తో పనిచేయ ను న్నాయి. వీటిలో  TSMC లేటెస్ట్ 3nm ప్రాడక్టుతో నిర్మించబడుతుంది. స్పీడ్, బ్యాటరీ పనితీరు సామర్థ్యాన్ని పెంచుతుందని టెక్ నిపుణులు అంటున్నారు. 

లీకులలో అత్యంత ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి ఐఫోన్ 17 ఎయిర్. ప్రస్తుత ఐఫోన్ ప్లస్కు ఇది ప్రత్యామ్నాయంగా రానుంది. ఐఫోన్ 17 ఎయిర్ ను ఐఫోన్ స్లిమ్ అని కూడా పిలుస్తారు. ఇది 6.6 అంగుళాల డిస్ ప్లే, 8GB  RAM , డైనమిక్ ఐలాండ్ తో వస్తుంది.ఇది ఐఫోన్ 17 ప్రో మాదిరిగానే A19 బయోనిక్ చిప్ తో పనిచేస్తుంది. Apple మొదటి ఇంటర్నల్ 5G మోడెమ్ ను ప్రారంభించే అవకాశాలున్నాయి. 

కెమెరా విషయానికొస్తే..iPhone 17Air లో 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 24 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి.ఎయిర్ మోడల్ కొత్త డిజైన్ ను కూడా పరిచయం అవుతుందని భావిస్తు న్నారు. ఇది అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది.