ఒంటిపై చొక్కా, ప్యాంటు ఉందా లేదా అనేది కూడా చూసుకోవటంలేదు..అది గుడి అయినా..బడి అయినా..పెళ్లి అయినా..చావు అయినా..చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సింది. ఫోన్ లేకపోతే అంతా వెలితి..ఏదో కోల్పోయినట్లు ఫీలింగ్..ఇలాంటి రోజుల్లో..ఓ వ్యక్తి తనకు ఇష్టమైన గుడికి వెళ్లాడు..దేవుడిని దర్శించుకున్నాడు..ఆ తర్వాత హుండీ దగ్గరకు వచ్చాడు..డబ్బులతోపోటు పొరపాటున తన దగ్గర ఉన్న లక్ష రూపాయలు ఐఫోన్ కూడా హుండీలో వేసేశాడు..అయ్యో అయ్యయ్యో అంటూ..వెంటనే ఆలయ అధికారుల దగ్గరకు వెళ్లాడు..నా ఐఫోన్ హుండీలో పడిపోయింది..ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టాడు..అప్పుడు ఆ ఆలయ అధికారులు..ఆ భక్తుడి ఐఫోన్ తిరిగి ఇచ్చారా లేదా..ఏం జరిగింది..డీటెయిల్డ్ గా తెలుసుకుందాం..
iPhone accidentally fell into the temple's hundi..
— Vije (@vijeshetty) December 20, 2024
The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib
అది తమిళనాడులోని తిరుపోరూర్ శ్రీ కందస్వామి దేవాలయం. అదే ప్రాంతానికి చెందిన దినేష్ అనే భక్తుడు దేవున్ని దర్శించుకునేందుకు వచ్చాడు..దైవ దర్శనం అయిపోయింది.దేవునికి కానుకలు వేసేందుకు ఆలయంలోని హుండీ వద్దకు వచ్చాడు..అయితే మనోడు ఫోన్ లో బిజిగా ఉన్నాడు. హుండీలో కానుకలతోపాటు ఐఫో న్ కూడా వేశాడు. ఆ తర్వాత నాలుక్కర్చుకున్నాడు.
లక్ష రూపాయల ఐఫోన్..పైగా కొత్తగా కొన్నాడు. దీంతో ఐఫోన్ తిరిగి ఇవ్వాలని దేవాలయం సిబ్బందిని సంప్రదించాడు. అయితే దేవాలయం సిబ్బంది ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యాడు. దేవుని హుండీలో ఏ వస్తువు వేసినా అది దేవునికే చెల్లుతుందని.. దినేష్ రిక్వెస్ట్ ను తిరస్కరించారు.
ALSO READ | Bihar Power Plant: థర్మల్ పవర్ప్లాంట్..అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులు
అయితే హుండీ లెక్కింపు చేపట్టిన ఆలయ సిబ్బంది.. ఐఫోన్ దొరికిందని దినేష్ కు సమాచారం ఇచ్చారు. అయితే ఐఫోన్ మాత్రం ఇవ్వడం కుదరదు. కావాలంటే ఐఫోన్ లో ఉన్న దినేష్ కు సంబంధించిన డేటాను మాత్రం తీసుకోవచ్చని చెప్పారు. దినేష్ దానికి ఒప్పుకోలేదు. తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు.
జరిగిన విషయాన్ని హెచ్ ఆర్ సీఈ మంత్రి పీకే శేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన కూడా దేవాలయ సిబ్బంది చెప్పిందే చెప్పాడు. హుండీ పెట్టెలో జమ చేసిన ఏదైనా అది దేవుని ఖాతాలోకి వెళ్తుంది అని బదులిచ్చారు.
అయితే దినేష్ కు మంత్రి ఓ హామీ మాత్రం ఇచ్చారు. దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి భక్తులకు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఏదైనా ఉందేమో చూస్తానని చెప్పాడు.