చేతిలో ఐఫోన్ ఉండాలనేది మీ కోరికా..!.. లక్షలు వెచ్చించి యాపిల్ బ్రాండ్ ఫోన్ కొనుగోలు చేయలేక ఆఫర్ల సమయం కోసం వేచి ఉన్నారా..! అయితే మీకో గుడ్ న్యూస్. యాపిల్ త్వరలో చవకైన ఐఫోన్‌ను లాంఛ్ చేయనుంది. 'ఐఫోన్ SE 4' పేరుతో రానున్న ఆ ఫోన్ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి రానుందని నివేదికలు చెప్తున్నాయి. తాజాగా సదరు SE 4 ఫస్ట్ లుక్ ఫోటోలు రివీల్ అయ్యాయి.
SE 4.. 6.06 అంగుళాల ఫుల్ హెచ్ఢీ ప్లస్ డిస్ ప్లేతో రానుందని అంచనా. 6GB/ 8GB RAM రెండు వేరియంట్లలో లాంఛ్ కానున్న ఈ మోడల్ A18 లేదా A17 ప్రో బయోనిక్ చిప్‌తో రానుందని నివేదికలు బయట పెడుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతోన్న iPhone SE 4 డమ్మీని బట్టి ఈ మోడల్ వైట్ & బ్లాక్ రెండు కలర్స్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ మరొక విషయం.. SE 4లో సాధారణ ఐఫోన్ మోడళ్లతో హోమ్ ఆప్షన్ తొలగించినట్లు తెలుస్తోంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే కనిపిస్తోంది. అలాగే, ఫోన్ ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్, మ్యూట్ స్విచ్, దిగువన సిమ్ ట్రే ఉన్నాయి.
48 MP బ్యాక్ కెమెరా
ఇక ఐఫోన్ SE 4 కెమెరాల విషయానికొస్తే.. వెనుకవైపు 48MP ప్రైమరీ లెన్స్‌ని కలిగి ఉండే ఒకే కెమెరా ఉండవచ్చని అంచనా. 48 ఎంపీ అయినా ఇతర ఎస్ఈ మోడల్‌లో ఇదే అత్యంత అధునాతన కెమెరా సెటప్ అనుకోవాలి. కెమెరా మెరుగుదలతో పాటు బ్యాటరీ లైఫ్, ఇతర హార్డ్‌వేర్ భాగాలలోనూ అప్‌గ్రేడ్‌లను ఆశించవచ్చు.
Also Read :- 20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
ఇక దీని ధర విషయానికొస్తే.. భారత కరెన్సీలో సుమారు రూ. 42వేల నుండి రూ. 45వేల మధ్య ఉండవచ్చని అంచనా. మొత్తంగా చూసుకుంటే.. రూ.50లోపే. దీనికి కార్డు ఆఫర్లు గట్రా కలుపుకుంటే రూ. 40వేలకే సొంతం చేసుకోవచ్చు.
First look at the iPhone SE 4 Dummy pic.twitter.com/qL0COgmPPA
— Sonny Dickson (@SonnyDickson) January 16, 2025