
ఐఫోన్ సీరీస్ లలో మోస్ట్ అఫర్డబుల్ సీరీస్ ఏదంటే అది SE సీరీస్.. ఇందులో ఫోర్త్ జనరేషన్ ఫోన్.. ఐఫోన్ ఎస్ఈ-4(iPhone SE 4) లాంచ్ కానుండటంతో కస్టమర్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. SE సీరీస్ ను ఆపేస్తున్నట్లు ప్రకటించి.. రెండేళ్ల తర్వాత ఆ సీరీస్ కు ఉన్న ఆదరణతో 4వ జనరేషన్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది Apple కంపెనీ. ఏఐ టెక్నాలజీతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ లో కంపెనీ తీసుకొచ్చిన చేంజెస్ ఇలా ఉన్నాయి.
హోమ్ బటన్.. టచ్ ఐడీ ఉండదు.. యాక్షన్ బటన్స్ లో మార్పులు:
గత 18 ఏళ్లుగా బ్రాండ్ క్రియేట్ చేసిన ఐఫోన్ హోమ్ బటన్ ఈ ఫోన్ లో ఉండదు. దీనికి బదులుగా ఫేస్ అథెంటికేషన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో ఐఫోన్ 15 ప్రో లో ఉన్న మ్యూట్ బటన్ ఇస్తున్నారు.
పెద్ద డిస్ప్లే.. ఐఫోన్ 16 లో వాడిన ఏఐ చిప్:
ఈ ఫోన్ లలో ఉండే బెజెల్ డిస్ప్లే తీసేసి.. 4.7 ఇంచుల LCD డిస్ప్లే నుంచి 6.1 ఇంచుల OLED డిస్ప్లేకు అప్ గ్రేడ్ చేస్తున్నారు. డిస్ప్లే సైజ్ పెంచడం పెద్ద అడ్వాంటేజ్. ఐఫోన్ 16 లో వాడిన ఏఐ చిప్ ను ఈ ఫోన్ లో వినియోగిస్తున్నారని టాక్. A15 Bionic ప్లేస్ లో AI 16 చిప్ వినియోగిస్తు్న్నట్లు తెలుస్తోంది.
మరింత RAM, స్టోరేజీ.. కెమెరా అప్ గ్రేడ్:
ర్యామ్ ను 4GB నుంచి 8GB కి, స్టోరేజీని డబుల్ చేస్తూ 128GB కి అప్ గ్రేడ్ చేశారు. బేసిక్ కెమెరా అయిన 12MP నుంచి 48MP కి అప్ గ్రేడ్ చేశారు.
బ్యాటరీ సైజ్ పెంపు.. USB-C చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్:
ప్రస్తుత మోడల్స్ లో ఉన్న 2,018mAh కెపాసిటీ బ్యాటరీ కంటే పెద్ద సైజ్ లో 3,279mAh ని ఈ ఫోన్ లో అప్ గ్రేడ్ చేశారు.
ఐఫోన్ లలో అందరూ ఇబ్బంది పడిన సమస్య చార్జర్ విషయంలోనే. అయితే ఎస్ఈ4 ఫోన్ లో అందరూ వాడుతున్న యూఎస్ బీ-సీ టైప్ చార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. అదేవిధంగా MagSafe వైర్ లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఈ ఫోన్ లో ఉంది.
ఫైనల్ గా ఐ ఫోన్ ఎస్ఈ4 రూ.43,299 తో ప్రైస్ తో మార్కెట్లోకి వస్తోంది. ఇంకేంటి ఐ ఫోన్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకే వారికి బెస్ట్ ప్రైజ్ లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ రెడీ గా ఉంది. వీలైతే ట్రై చేయండి.