ఆపిల్ 2022 నుంచి ఇప్పటివరకు మార్కెట్ లో ఒక్క బడ్జెట్ ఐఫోన్ కూడా ప్రవేశపెట్టలేదు.అయితే ఆపిల్ కంపెనీ కొత్త బడ్జెట్ ఐఫోన్ ను తీసుకొచ్చేందుకు ప్రయ త్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఆపిల్ త్వరలో iPhone SE 4 పేరులో బడ్జెట్ ఐఫోన్ ను తీసుకురాబోతోంది. ఈ ఐఫోన్ SE 4 ధర లాంచ్‌కు ముందే వెల్లడైంది. దీంతోపా టు Apple రాబోయే బడ్జెట్ ఐఫోన్ గతంలో ప్రారంభించిన అన్ని iPhone SE మోడల్‌లతో పోలిస్తే చాలా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని అంచనా.ఫోన్ డిజైన్, బ్యాటరీలో కనిపిస్తాయి.
ఐఫోన్ SE 4 లీక్ ధర
అయితే Tipster ఐఫోన్ SE 4 ధరను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. దీని ధర సుమారు 500 యూఎస్ డాలర్లు.అంటే దాదాపు రూ. 41,000 ఇది 2022లో ప్రారంభించబడిన iPhone SE 3 ప్రారంభ ధర రూ.35,000 తో పోల్చితే కొంచెం ఎక్కువ.
iPhone SE 4 స్పెసిఫికేషన్‌లు (అంచనా)
iPhone SE 4 iPhone 14 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉండవచ్చు అంచనా. ఇది 6.1-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, మొదటిసారిగా ఫేస్ IDతో వస్తున్నట్లు తెలుస్తోంది. అదనంగా ఇది Apple 5G మోడల్‌కు మద్దతు, USB టైప్-సి ఛార్జింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఫోన్ iOS 18 , AI ఫీచర్లతో కూడా వస్తుందని అంచనా.