
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ ఐఫోన్ ఎస్ఈ2(ఐఫోన్ 9)ను మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ నెల 15న దీనిని అఫీషియల్‌గా మార్కెట్లోకి తీసుకురానుంది. వాస్తవానికి మార్చి 31నే ఐఫోన్ ఎస్ఈ2ను రిలీజ్ చేయాల్సి ఉన్నా.. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు 15వ తేదీన రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఐఫోన్ ఎస్ఈ2 వార్తల్లో నిలుస్తోంది. దీని లీక్డ్ ఫొటోలు, ఫీచర్ల వివరాలు తరచుగా మీడియాలో కనిపిస్తూ వచ్చాయి. 2016లో ఐఫోన్ ఎస్ఈకి అప్డేట్ వెర్షనే ఇది. 4.7 ఇంచెస్ ఎల్ సీడీ డిస్ ప్లే సైజుల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు 399 డాలర్లు(రూ.30,400). 2016లో ఎస్ఈని రిలీజ్ చేసినప్పుడు దాని రేటు కూడా దాదాపు ఇంతే ఉంది. సిల్వర్, గోల్డ్, గ్రే కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఏ13 బయోనిక్ చిప్‌సెట్‌ను వాడనున్నారు. 3జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీవీ వేరియంట్లలో లభించనుంది. అయితే ఇండియాలో ఈ ఫోన్ ఎప్పటి నుంచి లభిస్తుందనే సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు.