ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. Whats app లో ఒకేసారి 31 మంది గ్రూప్ కాల్ చేయొచ్చు

వాట్సప్ వినయోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సప్ గ్రూప్ కాల్ లో పాల్గొనే వారి సంఖ్యను పెంచింది. ఐఫోన్ లో వాట్సప్ ఉపయోగించే వారు ఇకపై వాట్సప్ వీడియో, ఆడియా కాల్స్ లో 31 మంది సభ్యులు పాల్గొనవచ్చు. ఇంతకుముందకు 15 మందికి మాత్రమే అనుమతి ఉంది. వినియోగదారులకు మెరుగైన కాలింగ్ కోసం అప్ డేట్ చేయబడిన ఫీచర్ ..యాప్ స్టోర్ లో iOS 23.21.72 అప్ డేట్ తో అందుబాటులో ఉంది. 

15 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో గ్రూప్ కాల్ ప్రారంభించాలనుకున్నప్పుడు వినియోగదారులు స్ర్కీన్ కుడి భాగం పైన ఉన్న కాల్ బటన్ ను నొక్కి ఆపై మీరు కాల్ కి జోడించాలనుకుంటున్న కాంటాక్టులను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 31 మందిని జోడించిన తర్వాత కాల్ ను ప్రారంభించాలంటే.. Start బటన్ ను నొక్కాలి. యాప్ లేటెస్ట్ వెర్షన్ వాడుతున్న ఐఫోన్ వినియోగదారులందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని వాట్సప్ తెలిపింది.

వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేక్రమంలో  వాట్సప్ లో కొత్త AI  సేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఈ సేవలు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. త్వరలో వినియోగదారులకు అందుబాటులో వస్తాయి. 

కొత్త AI సేవల్లో ఒకటి AI స్టిక్కర్లు.. దీని ద్వారా టెక్ట్స్  ప్రాంప్ట్ లను ఉపయోగించి వాటికి అనువైన స్టిక్కర్లను సృష్టించవచ్చు. ఉదాహరణకు ‘‘నేను సంతోషంగా ఉన్నాను ’’ అని టెక్ట్స్ ఇస్తే.. AI   ఆ సెంటిమెంట్ కు సరిపోయే స్టిక్కర్ ను రూపొందిస్తుంది. 

ALSO READ :- 29 రోజుల్లో ఎన్నికలు.. ఫాంహౌజ్లో కేసీఆర్ రాజశ్యామల యాగం