‘ఫేస్​ ఐడీ’ లేకుండా ఐ ఫోన్‌

‘ఫేస్​ ఐడీ’ లేకుండా ఐ ఫోన్‌

వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఫోన్లలో  ప్రస్తుతం ఉన్న ‘ఫేస్​ ఐడీ, ఫింగర్​ప్రింట్​ స్కానర్’ను తొలగించనున్నట్లు యాపిల్​ ప్రకటించింది. అయితే సొంత అథెంటికేషన్​ సిస్టమ్​ను అప్​గ్రేడ్​ చేస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడున్న ఫేస్​ఐడీ, టచ్​ ఐడీ బదులు ‘అండర్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్’ టెక్నాలజీని రూపొందిస్తోంది. 2021 నుంచి రాబోయే ఫోన్లలో నాచ్​ లేకుండా ఫుల్​స్క్రీన్​ డిస్​ప్లే ఉంటుందని తెలిపింది. యాపిల్ వాచ్​కు సంబంధించి ‘వాకీటాకీ’ యాప్​ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఒక యూజర్​ సమాచారాన్ని (వాయిస్​ చాట్) ​మరో యూజర్​ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యాప్​ను తొలగిస్తున్నట్లు యాపిల్​ తెలిపింది.