తగ్గిన ఐఫోన్ ధరలు

తగ్గిన ఐఫోన్ ధరలు

న్యూఢిల్లీ: ఫోన్లు, వీటి అసెంబ్లింగ్‌‌‌‌లో వాడే  ప్రింటెడ్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ బోర్డ్ అసెంబుల్‌‌‌‌ (పీసీబీఏ), ఛార్జర్లపై  కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం 2‌‌‌‌‌‌‌‌0 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో యాపిల్ ఐఫోన్‌‌‌‌ ధరలను తగ్గించింది.    ఐఫోన్ ధరలు రూ.5,900 వరకు తగ్గాయి.  ఇండియాలో అసెంబుల్ అవుతున్న  ఐఫోన్ ఎస్‌‌‌‌ఈ ధర రూ.49,900 నుంచి రూ.47,600 కు దిగొచ్చింది. ఇది 4.6 శాతం తగ్గుదల. అంతేకాకుండా దిగుమతి చేసుకుంటున్న ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌‌‌‌ ధరలను యాపిల్ తగ్గించింది. 

15 ప్రో ధర రూ. 5,100 తగ్గగా, 15 ప్రో మ్యాక్స్ ధర రూ.5,900 దిగొచ్చింది. 15 ప్రో ధర రూ. 1,29,800 ఉంది. తాజాగా ఈ ఫోన్ రేటు 3.7 శాతం తగ్గింది. ప్రో మ్యాక్స్ ధర రూ.1,54,000 ఉండగా, తాజాగా 3.7 శాతం తగ్గింది.  ఇండియాలో అసెంబుల్ అవుతున్న ఇతర ఐఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గాయి. లేటెస్ట్ ఐఫోన్‌‌‌‌ 15, 15 ఫ్లస్‌‌‌‌, ఐఫోన్ 14, 14 ప్లస్‌‌‌‌  రేట్లు రూ.300  చొప్పున తగ్గాయి. మరోవైపు ఇండియాలో అసెంబుల్ అవుతున్న శామ్‌‌‌‌సంగ్ ఫోన్ల రేట్లు తగ్గలేదు.