పవర్ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్..నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌తో సన్ రైడర్స్‌‌‌‌‌‌‌‌ ఢీ

పవర్ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్..నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌తో సన్ రైడర్స్‌‌‌‌‌‌‌‌ ఢీ
  • నేడు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌
  • గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌‌‌‌‌‌‌‌కు

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ : ఐపీఎల్‌‌‌‌‌‌‌‌17లో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ సమరానికి సర్వం సిద్ధమైంది. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో టాప్‌‌‌‌‌‌‌‌ లేపిన కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌, సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ అదే జోరుతో  ఫైనల్ చేరేందుకు  రెడీ అయ్యాయి.  పవర్ హిట్టర్లతో కూడిన  ఇరు జట్ల మధ్య మంగళవారం అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్–1 మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గి నేరుగా ఫైనల్ చేరాలని ఇటు సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌.. అటు నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌ కోరుకుంటున్నాయి. ఓడిన జట్టు  ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచే టీమ్‌‌‌‌‌‌‌‌తో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

కాగా,  ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రెండు  జట్లూ స్టార్టింగ్ నుంచే సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేశాయి. కేకేఆర్‌‌‌‌‌‌‌‌ అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ చేరుకోవడంతో పాటు టాప్ ప్లేస్ సాధించింది. మరోవైపు గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌ను పడగొట్టిన ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది.  ‌‌‌‌‌‌‌‌ఇరు జట్లూ ఆదివారం తమ చివరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడి వేల కిలోమీటర్లు ప్రయాణించి అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ చేరుకున్నాయి. ప్రాక్టీస్ లేకుండానే ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లు ఒకేసారి తలపడగా.. కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. ఈ సారి పైచేయి ఎవరిదో చూడాలి.

సాల్ట్‌‌‌‌‌‌‌‌ లేకుండా కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కేకేఆర్ చివరి 2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లూ వర్షంతో  రద్దయ్యాయి. 10 రోజుల కిందట ఆ జట్టు తమ చివరి మ్యాచ్ ఆడింది. ఇన్ని రోజుల గ్యాప్ రావడం ఆ జట్టుకు కాస్త ప్రతికూలాంశం కానుంది. అయితే, అంతకుముందు వరుసగా నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు నెగ్గిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కోల్‌‌‌‌‌‌‌‌కతాను తక్కువగా అంచనా వేయడానికి లేదు.  కానీ, జోరు మీదున్న ఓపెనర్, కీపర్ ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌ (435 రన్స్‌‌‌‌‌‌‌‌) లేకపోవడం మైనస్ అనొచ్చు. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్ నరైన్‌‌‌‌‌‌‌‌తో కలిసి  అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన సాల్ట్‌‌‌‌‌‌‌‌ కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయాలకు బాటలు వేశాడు. అతని స్థానాన్ని రహ్మనుల్లా గర్బాజ్‌‌‌‌‌‌‌‌ ఏ మేరకు భర్తీ చేస్తాడో చూడాలి.

మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ శ్రేయస్ (287) పెద్దగా ప్రభావం చూపలేదు. ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌లో అయినా తను బ్యాట్‌‌‌‌‌‌‌‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది.  అయితే, నితీష్‌‌‌‌‌‌‌‌ రాణా ఫామ్‌‌‌‌‌‌‌‌ అందుకోవడం, విండీస్ హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆండ్రీ రసెల్, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్  మంచి ఫినిషింగ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తుండటం ప్లస్ పాయింట్ కానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా తక్కువ సమయం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో తన మార్కు చూపెట్టలేదు.

ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌లో ఏం చేస్తాడో చూడాలి. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ  కేకేఆర్ పదునుగానే ఉంది. యంగ్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షిత్ రాణా మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. స్టార్క్, రసెల్‌‌‌‌‌‌‌‌తో పాటు స్పిన్నర్లు నరైన్‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు.

రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఆత్మవిశ్వాసంతో

గుజరాత్‌‌‌‌‌‌‌‌తో పోరు వర్షంతో  రద్దయిన తర్వాత పంజాబ్‌‌‌‌‌‌‌‌పై భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఈజీగా ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసి గెలిచిన సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బాల్‌‌‌‌‌‌‌‌  నుంచే వీరబాదుడు ఆటతో  ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరుగుల మోత మోగించి రికార్డులు బ్రేక్ చేసింది. ఇద్దరూ 200 ప్లస్ స్ట్రయిక్ రేట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ బౌలర్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డకౌటైనప్పటికీ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో హెడ్‌‌‌‌‌‌‌‌ ఓ సెంచరీ, నాలుగు ఫిఫ్టీలు సహా 533 రన్స్‌‌‌‌‌‌‌‌తో జోరు మీదున్నాడు. అభిషేక్​(467) తన కెరీర్ బెస్ట్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు.  

అలవోకగా బంతిని స్టాండ్స్‌‌‌‌‌‌‌‌కు పంపిస్తున్న అతను ఈ సీజన్‌లోనే  ఏకంగా 41 సిక్సర్లు కొట్టాడు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో రాహుల్ త్రిపాఠి పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నాడు. వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.  మధ్యలో కాస్త తడబడిన హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌‌‌‌‌ పంజాబ్‌‌‌‌‌‌‌‌పై మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో మళ్లీ ఫామ్‌‌‌‌‌‌‌‌ అదుకోవడంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ పదునెక్కింది.

కూల్ కెప్టెన్ కమిన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నటరాజన్, షాబాజ్‌‌‌‌‌‌‌‌ అహ్మద్, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాన్సెన్‌‌‌‌‌‌‌‌లతో బలమైన బౌలింగ్ టీమ్స్‌‌‌‌‌‌‌‌లో ఒకటిగా హైదరాబాద్ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి సమష్టిగా ఆడితే హైదరాబాద్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరడం పక్కా అనొచ్చు.