రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. బర్సపరా స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు అంపైర్లు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. రాత్రి 10 గంటల తర్వాత వర్షం కాసేపు ఆగడంతో మ్యాచ్ నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఓడు ఓవర్ల చొప్పున మ్యాచ్ ను కుందించి.. టాస్ కూడా వేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో ఇరుజట్ల కెప్టన్లతో మాట్లాడి మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అనంతరం ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
దీంతో రాజస్థాన్ జట్టు పాయిట్ల పట్టికలో 17 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సమాంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ కారణంగా హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకోగా.. రాజస్థాన్ మూడో స్థానానికి పడిపోయింది. దీంతో ఎస్ఆర్ హెచ్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్ కతా జట్టుతో ఢీ కొననుంది. ఇక, రాజస్థాన్, బెంగళూరు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనున్నాయి.