ఐపీఎల్ హరితహారం: 146 ఎకరాల్లో.. లక్షా 47వేల మొక్కలు

ఐపీఎల్ హరితహారం: 146 ఎకరాల్లో.. లక్షా 47వేల మొక్కలు

భారత క్రికెట్‌ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో భాగంగా ప్లేఆఫ్స్‌ మ్యాచుల్లో బౌలర్లు వేసే ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటుతామని ప్రకటించింది. ఆ మాట ప్రకారం.. క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ -2, ఫైనల్ మ్యాచులలో మొత్తం 294 డాట్ బాల్స్ పడగా, లక్షా 47వేల మొక్కలు నాటనున్నారు. 

4 మ్యాచులు.. లక్షా 47వేల మొక్కలు

ప్లేఆఫ్స్‌ మ్యాచులైన క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ లో కలిపి బౌలర్లు మొత్తం 294 డాట్ బాల్స్ వేశారు. చెపాక్ వేదికగా జరిగిన చెన్నై-గుజరాత్ క్వాలిఫయర్-1లో 84 డాట్ బాల్స్ వేయగా, ముంబై-లక్నో మధ్య జరిగిన ఎలిమిటనేటర్ మ్యాచులో 96 డాట్ బాల్స్ పడ్డాయి. ఇక ముంబై-గుజరాత్ మధ్య జరిగిన రెండో క్వాలిఫయర్ లో 67 డాట్ బాల్స్ నమోదవ్వగా, చెన్నై-గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో 45 డాట్ బాల్స్ పడ్డాయి.

146 ఎకరాలు అవసరం.. 

ఈ మొక్కలు నాటేందుకు గానూ146 ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక హెక్టార్‌‌ లో 2,500 మొక్కలు నాటేందుకు అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఒక లక్షా 47వేల మొక్కలకు 59 హెక్టార్లు అవసరం. అంటే.. 146 ఎకరాలు. మరి ఇన్ని ఎకరాల విస్తీర్ణం అంటే బీసీసీఐ ఎక్కడ సమీకరిస్తుందో తెలియాలి.

ఏ మ్యాచులో ఎన్ని మొక్కలంటే.. 

క్వాలిఫయర్-1: 84 డాట్ బాల్స్ - 42 వేల మొక్కలు
ఎలిమిటనేటర్ మ్యాచ్: 96 డాట్ బాల్స్ - 48వేల మొక్కలు
క్వాలిఫయర్-2: 67 డాట్ బాల్స్ -26వేల 500 మొక్కలు
ఫైనల్ మ్యాచ్: 45 డాట్ బాల్స్- 22 వేల ఐదు వందల మొక్కలు