ఐపీఎస్ 2023 ఫైనల్ మ్యాచ్ సాయంత్రంగా ఏడు గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. షెడ్యూల్ ప్రకారం మే 28వ తేదీనే జరగాల్సిన ఉన్నా.. వర్షం కారణంగా మే 29వ తేదీకి వాయిదా పడింది. ఇవాళ అయినా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ లో మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు అయితే ఎండ బీభత్సంగా ఉంది. టెంపరేచర్ 39 డిగ్రీలుగా నమోదు అవుతుంది. ఉక్కబోత ఉంది. మోడీ క్రికెట్ స్టేడియం సైతం ఎండ తీవ్రతకు ఆరిపోయింది. గ్రౌండ్ అంతా చక్కగా తయారైంది. పిచ్ పై ఉన్న తేమ కూడా ఆరిపోయింది. మ్యాచ్ కు స్టేడియం రెడీ అని ప్రకటించారు నిర్వహకులు..
ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా.. రాత్రి 8 గంటల నుంచి వర్షం పడే అవకాశాలు 50 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షం పడకపోయినా చెదురు మదురు వాన పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తుంది. నిన్నంత భారీగా వర్షం పడే అవకాశాలు లేవని స్పష్టం చేస్తుంది. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి కూడా 39 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదు అవుతుందని.. ఉక్కబోతగా ఉందని.. రాత్రికి ఈ పరిణామాలు వర్షానికి దారితీయొచ్చని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.
మ్యాచ్ జరిగే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయని ప్రస్తుత వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఒక వేళ వర్షం పడినా వెంటనే తగ్గిపోతుందని.. నిన్నటి అంత భారీ వర్షం పడే అవకాశాలు లేవని చెబుతున్నారు అధికారులు. మొత్తానికి రిజర్వ్ డే రోజు మాత్రం.. ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుణ దేవుడు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి...