అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ వీదురు గాలులు వీస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉన్న నరేంద్ర మోడీక్రికెట్ స్టేడియం కూడా తడిసి ముద్దయ్యింది. వరణుడు కాసేపు తెరపు ఇస్తున్నా.. మరలా వర్షం పడుతోంది. ఒకవేళ వర్షం ఆగితే.. స్టేడియంలో అధునాతన డ్రైనేజీ స్టిసమ్ ఉండడం వల్ల అరగంటలో పిచ్ ఆటకు సిద్ధం చేయగలరు..
ఇవాళ రాత్రి 10 గంటల 10 నిమిషాలలోపు మ్యాచ్ ప్రారంభమైతే పూర్తి ఓవర్ల మ్యాచ్ చూడవచ్చు. ఆ తర్వాత వర్షం తగ్గి మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లను కుదిస్తారు. అర్ధరాత్రి 12 గంటల 06 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైతే చెరో 5 ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహిస్తారు. ముందుగా రేపు రిజర్వు డే అని వార్తలు వచ్చినప్పటికీ. .అది సాధ్యపడదని నిర్వహకులు తేల్చేసారు. దీంతో ఈరోజు మ్యాచ్ సజావుగా పూర్తి కాకపోతే కనీసం సూపర్ ఓవర్‌లో ఫైనల్ విజేతని తేలుస్తారు.
https://twitter.com/allaboutcric_/status/1662816671856467971
https://twitter.com/Debayan9696/status/1662813348227072001