అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ పోరుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. భారీ వర్షం కురుస్తుండడంతో సిబ్బంది పిచ్ అంతటిని కవర్లతో కప్పి ఉంచారు. ఈ కారణంగా టాస్ ఆలస్యం కానుంది. వర్షం ఆగాక.. పిచ్, ఫీల్డ్‌ని పరిశీలించిన తర్వాత అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు.
చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. విజేతను తేల్చే చివరి పోరు కావడంతో ఈ మ్యాచును వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచులో చెన్నై గెలిస్తే.. ఐదోసారి కప్ గెలిచి ముంబై రికార్డును సమం చేస్తోంది. అదే గుజరాత్ గెలిస్తే.. టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే.. రెండు ట్రోఫీలు గెలిచిన జట్టుగా అవతరిస్తుంది. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. పేపర్‌పై సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ, ఫైనల్ నెగ్గే అవకాశాలు గుజరాత్‌కే ఎక్కువుగా ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు.
https://twitter.com/iVikramRajput/status/1662813139652554752